AP NTR Bharosa Pensions : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే సామాజిక పింఛన్లను ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ భారీ కార్యక్రమం దృష్ట్యా ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జూలై 30వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సొమ్మును అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా వివరాలు…
ఈ ముందస్తు పంపిణీ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. వీరి కోసం ప్రభుత్వం రూ. 514.42 కోట్ల నిధులను కేటాయించింది. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా, సజావుగా సాగేందుకు వీలుగా జూలై 29 నాడే బ్యాంకులనుంచి అవసరమైన నగదు ఉపసంహరణ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రితో పాటు అనేకమంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఇతర ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉంటారు. అందుకే పెన్షన్ల పంపిణీకి ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి జూలై 30నే పంపిణీ శాతాన్ని వంద శాతానికి తీసుకెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని…. ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా లబ్ధిదారులకు అందాల్సిన ఆర్థిక సాయం సకాలంలో అందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.
{{/usCountry}}శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి జూలై 30నే పంపిణీ శాతాన్ని వంద శాతానికి తీసుకెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని…. ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా లబ్ధిదారులకు అందాల్సిన ఆర్థిక సాయం సకాలంలో అందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.
{{/usCountry}}