AP PGCET Counselling 2026 : ఏపీ పీజీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ
AP PGCET Phase 2 Counselling 2026 : ఏపీ పీజీసెట్ - 2026 రెండో విడత (చివరి దశ) కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇవాళ్టితో రిజిస్ట్రేషన్ల గడువు పూర్తి కానుండగా… రేపట్నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
AP PGCET Phase 2 Counselling 2026 : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పీజీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా… ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ గడువు నేటితో పూర్తి కానుంది.

ఏపీ పీజీసెట్ ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో (M.A., M.Sc., M.Com., M.Ed, M.P.Ed. మొదలైనవి) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులు… సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు కూడా ఇందులో పాల్గొనొచ్చు.
ముఖ్య తేదీలు….
- సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన అక్టోబర్ 15, 2026 వరకు ఉంటుంది.
- అక్టోబర్ 12, 2026 నుండి అక్టోబర్ 14, 2026 వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి.
- అక్టోబర్ 15, 2026వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
- అక్టోబర్ 17, 2026 పీజీసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
- అక్టోబర్ 21, 2026 నుండి అక్టోబర్ 24, 2026 కాలేజీలో రిపోర్టింగ్ ఉంటుంది.
- అక్టోబర్ 21 నుంచే తరగతులు ప్రారంభమవుతాయి.
- అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/
అర్హులైన అభ్యర్థులు అధికారిక అడ్మిషన్ల పోర్టల్ ద్వారా నిర్దేశిత గడువులోగా తమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 12 నుండి ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులు, కళాశాల ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సీటు కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 17న పూర్తయిన అనంతరం, అలాట్‌మెంట్ పొందిన విద్యార్థులు అక్టోబర్ 21 నుండి 24 మధ్య కేటాయించిన కళాశాలల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీలోపు రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

