...
...
Next Story

AP PGECET 2026 : ఏప్రిల్ 28 నుంచి ఏపీ పీజీఈసెట్ 2026.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

AP PGECET 2026 Exams : ఏపీ పీజీఈసెట్ 2026 పరీక్షలకు టైమ్ దగ్గర పడింది. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెడ్ డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Apr 25, 2026, 06:10:40 IST
Advertisement

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీఈసెట్‌)-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌.డి కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఆంధ్రా యూనివర్శిటీ ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

ఏపీ పీజీఈసెట్ 2026
ఏపీ పీజీఈసెట్ 2026

'ఎంటెక్, ఎంఫార్మసీల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్‌ను ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నాం. మొత్తం 12,102 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు ఉంటాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా 18 పట్టణాల్లో 26 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి.' అని ఉన్నత విద్యామండలి కార్యదర్శి తిరుపతిరావు ప్రకటించారు.

హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: cets.apsche.ap.gov.in/PGCET.
  • హోమ్‌పేజీలో ఉన్న డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి.
  • APPGCET 2026 Hall Ticket Downloadకి వెళ్తారు.
  • మీ లాగిన్ వివరాలను (అప్లికేషన్ ID, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ) నమోదు చేయండి.
  • పరీక్ష కోసం హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

ఈ లింక్ మీద క్లిక్ చేసి నేరుగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఏపీ పీజీఈసెట్‌ 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియకు మార్చి 6 వరకు అవకాశం ఇచ్చారు అభ్యర్థులు లేట్ ఫీజుతో మార్చి 23వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉండేది. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ 24-03-2026 నుంచి 25-03-2026 చేసుకున్నారు అభ్యర్థులు. ఏప్రిల్‌ 15 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంట్రెన్స్ టెస్టులో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe