Vijayawada : విజయవాడలో ఉగ్ర లింకులు....? ముగ్గురు యువకులు అరెస్ట్..!

విజయవాడలో ఉగ్ర లింకులు కలకలం రేపింది.  ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published on: Mar 24, 2026, 11:55:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు సోదాలు చేపట్టారు. సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి మద్దతు తెలుపుతున్నారన్న ఆరోపణలపై….ముగ్గురు యువకులకు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద నెట్ వర్క్ లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఉగ్ర సంస్థలతో లింకులు...! ముగ్గురు అరెస్ట్
ఉగ్ర సంస్థలతో లింకులు...! ముగ్గురు అరెస్ట్

ముగ్గురు అరెస్ట్…

అదుపులో తీసుకున్న వారిలో మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్ (23), మీర్జా సోహైల్ బేగ్ (23), మహ్మద్ డానిష్ (27) ఉన్నారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఓ అధికారులు తెలిపారు.

"ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా… మా బృందాలు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తీవ్రవాద కంటెంట్ ఉంటోంది. తీవ్రవాద భావజాలానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాం"అని ఓ అధికారి పిటిఐకి చెప్పారు.

ఈ ముగ్గురిని సోమవారం టూ టౌన్ ప్రాంతంలోని వారి నివాసం సమీపంలో అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 10 మంది సభ్యుల నెట్ వర్క్ లో ఈ బృందం భాగంగా ఉందని తెలుస్తోంది. యువతను ప్రభావితం చేయడానికి మరియు వారిని తీవ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.

ఉగ్రవాద సంస్థలతో వారికి సంబంధాలు…. వారి ఆన్ లైన్ కార్యకలాపాల స్వభావాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. విజయవాడ వించిపేట నారాయణస్వామి వీధిలో మొహ్మద్ రహమతుల్లా షరీఫ్, అబ్దుల్జాక్ వీధిలో మీర్జా సొహైల్ బేగ్, భవానీపురం ఇందిరా ప్రియదర్శినీ కాలనీలో మొహ్మద్ డానిష్ ఉన్నట్లు గుర్తించారు.

వీరిపై నిఘా పెట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్​ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎవరెవరితో సంప్రదింపుల్లో ఉన్నారు, వీరి భావజాలానికి ఆకర్షితులైన వారు ఇంకెవరైనా ఉన్నారా? అనే అంశాలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో ఆరా తీసే పనిలో పడింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More