...
...
Next Story

AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు - హాల్ టికెట్లు ఎప్పుడంటే..?

AP POLYCET Applications 2026 : ఏపీ పాలిసెట్ - 2026 దరఖాస్తుల గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు… ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Apr 2, 2026, 20:05:23 IST
Advertisement

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2026 - 2027 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు. అయితే తాజాగా ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.

ఏపీ పాలిసెట్ దరఖాస్తులు
ఏపీ పాలిసెట్ దరఖాస్తులు

ఏపీ పాలిసెట్ - 2026 దరఖాస్తుల గడువును ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన వాళ్లు ఆన్ లైన్ ద్వారా దఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అర్హులవుతారు.

ఏప్రిల్ 25న పాలిసెట్ ఎగ్జామ్….

ఏపీ పాలిసెట్ - 2026 పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిర్వహణకు 7 రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది కీలతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ పాలిసెట్ - దరఖాస్తు విధానం

  • ముందుగా https://polycetap.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
  • హోం పేజీలోని ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • మొబైల్ నెంబర్ లేదా పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • మీ వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్ ను పొందొచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks