AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - మార్చి మొదటి వారంలో హాల్‌టికెట్లు విడుదల
ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి.
ఏపీ పదో తరగతి విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా…. ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. త్వరలోనే అధికారికంగా తేదీని ప్రకటించనున్నారు.

మార్చి 16 నుంచి పరీక్షలు…
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి. ఇక మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్… మార్చి 21వ తేదీకి మారింది. మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇక విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీ లాంటి తప్పులు ఉంటే త్వరలోనే సవరణకు అవకాశం కల్పిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్(ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20)
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

