AP SSC Exams 2026 : ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే...?

ఏపీ టెన్త్‌ - 2026 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2026 మార్చి 16వ తేదీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 1వ తేదీతో పూర్తవుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి......

Published on: Nov 22, 2025, 05:00:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. వార్షిక పరీక్షల షెడ్యూల్ ను విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ఏపీ పదో తరగతి పరీక్షలు
ఏపీ పదో తరగతి పరీక్షలు

ఏ పరీక్ష ఎప్పుడంటే...?

మార్చి 16, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మార్చి 18, 2026 – సెకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 20, 2026 - ఇంగ్లీష్‌

మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)

మార్చి 25, 2026 – ఫిజిక్స్

మార్చి 28, 2026 – బయాలజీ

మార్చి 30 , 2026 – సోషల్‌ స్టడీస్‌

మార్చి 31, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2)

ఏప్రిల్‌ 1, 2026 – ఒకేషనల్‌ కోర్సు

ప్రస్తుతం రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు టెన్త్ విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిన్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. వొకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More