...
...
Next Story

AP SSC Results 2026 : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా రిజల్ట్ చూసుకోండి.

AP SSC Results 2026 Released : ఏపీ పదో తరగతి ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మీరు ఫలితాలను చూసుకోవచ్చు.

Published on: Apr 30, 2026, 11:00:18 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న AP SSC Released 2026 వచ్చేశాయి. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత శాతం నమోదవ్వడం విశేషం. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా, బాలికలే పైచేయి సాధించారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు:

ఈ లింక్ క్లిక్ చేసిన AP SSC Results 2026 చూసుకోవచ్చు.

  • వాట్సాప్ లో ఏపీ టెన్త్ ఫలితాలు
  • మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
  • వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  • మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత 'Download SSC Results' పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.

SSC పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ 1న ముగిశాయి. పరీక్షలకు నమోదు చేసుకున్న మొత్తం 6,29,109 మంది అభ్యర్థులలో మొదటి రోజున 6,22,217 మంది హాజరయ్యారు. అంటే 98.90 శాతం హాజరు శాతాన్ని సూచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు.

రీకౌంటింగ్, సప్లిమెంటరీ

ఫలితాల్లో మార్కుల పట్ల సంతృప్తి లేని విద్యార్థుల కోసం ప్రభుత్వం రీకౌంటింగ్ (Recounting), రీవెరిఫికేషన్ (Re-verification) చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు, ఫీజు వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుండా, వారి కోసం వెంటనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (Advanced Supplementary) పరీక్షలను నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థులు ఒక ఏడాది వృథా కాకుండా పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe