AP University Recruitment 2026 : ఏపీ యూనివర్శిటీల్లో 1,523 ఉద్యోగాలు - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

AP Universities Faculty Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,500లకు పైగా అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. https://apuniversitiesrecruitment.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jun 15, 2026, 05:13:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Universities Faculty Recruitment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో (యూనివర్సిటీలు) ఖాళీగా ఉన్న భారీ సంఖ్యలోని అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఇచ్చిన గడువు నేటితో (జూన్ 15) ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే, వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.

ఏపీ యూనివర్శిటీల్లో 1,523 ఉద్యోగాలు - ఇవాళే లాస్ట్ డేట్
ఏపీ యూనివర్శిటీల్లో 1,523 ఉద్యోగాలు - ఇవాళే లాస్ట్ డేట్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు మరో కీలకమైన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులతో పాటు, తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాల హార్డ్‌ కాపీలను (Hard Copies) సంబంధిత వర్సిటీలకు కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ హార్డ్‌ కాపీలను యూనివర్సిటీలకు సమర్పించేందుకు ఈ నెల 22వ తేదీ వరకు అధికారులు గడువు ఇచ్చారు.

రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ :

అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ స్క్రూటినీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులు, అలాగే అనర్హుల ప్రాథమిక జాబితాను ఈ నెల 29న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఈ ప్రాథమిక జాబితాలపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే, వారు జులై 6వ తేదీ వరకు తమ రిప్రజెంటేషన్లను సమర్పించుకోవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత, అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను జూలై 7న అధికారికంగా విడుదల చేస్తామని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఖాళీల వివరాలు:

నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో మొత్తం 1,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో రెగ్యులర్ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ ఖాళీలు కూడా ఉన్నాయి.

  • ప్రొఫెసర్: మొత్తం 63 పోస్టులు (అన్నీ రెగ్యులర్ పోస్టులే, బ్యాక్‌లాగ్ ఖాళీలు లేవు)
  • అసోసియేట్ ప్రొఫెసర్: మొత్తం 334 పోస్టులు (రెగ్యులర్: 191, బ్యాక్‌లాగ్: 143)
  • అసిస్టెంట్ ప్రొఫెసర్: మొత్తం 1,020 పోస్టులు (రెగ్యులర్: 886, బ్యాక్‌లాగ్: 134)
  • లెక్చరర్ (కేవలం RGUKT పరిధిలో): మొత్తం 104 పోస్టులు (అన్నీ రెగ్యులర్ పోస్టులే)
  • అసిస్టెంట్ లైబ్రేరియన్: మొత్తం 2 పోస్టులు (అన్నీ బ్యాక్‌లాగ్ ఖాళీలే)

అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నియామకాల ప్రక్రియను సరళతరం చేస్తూ, అభ్యర్థుల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను ( https://apuniversitiesrecruitment.apcfss.i n ) అందుబాటులోకి తెచ్చింది. గతంలో లాగా ఒక్కో యూనివర్సిటీకి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఈ సింగిల్ విండో పోర్టల్‌లో అభ్యర్థులు ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుంటే సరిపోతుంది.

ఇందులో ఉన్న 'మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్' ద్వారా ఒకే అప్లికేషన్‌తో ఒకటి కంటే ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వెరిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు, భవిష్యత్తులో జరిగే సంప్రదింపులు, అప్‌డేట్స్ అన్నీ కూడా ఈ డిజిటల్ స్మార్ట్ పోర్టల్ ద్వారానే పారదర్శకంగా సాగుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More