మహిళలకు అంగన్వాడీలో ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. అనంతపురం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అంగన్వాడీ హెల్పర్ 14, అంగన్వాడీ వర్కర్ 78 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అంగన్వాడీ నియామకం కోసం నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 8 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు అప్లై చేయాలి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయములో పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తును కార్యాలయములో సమర్పించి రసీదు పొందాలి.
అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. అభ్యర్థులు వివాహితులై, స్థానికంగా నివాసం ఉన్నవారు కావాలి. అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండాలి. 01.07.2025 నాటికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండాలి.
అంగన్వాడీ కార్యకర్తకు నెలకు గౌరవ వేతనం రూ:11500, అంగన్వాడీ సహాయకులు గౌరవ వేతనం రూ:7000 చెల్లిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కులము (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదో తరగతి మార్క్స్ మెమో, ఆధార్, దివ్యాంగ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికారితో ధృవీకరణ పత్రాలను జతపరచాలి.
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదో తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో సీడీపీఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావాలి.
{{/usCountry}}అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదో తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో సీడీపీఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావాలి.
{{/usCountry}}ఖాళీల వివరాల కోసం సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించాలి. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును. మరిన్ని వివరాల కొరకు సంబందిత సీడీపీవో కార్యాలయం లేదా అనంతపురం జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.inలో చూసుకోవచ్చు.