ఏపీ అంగన్వాడీలో ఉద్యోగాలు.. లోకల్‌ వారికే జాబ్.. ఇలా అప్లై చేయండి

మహిళలకు ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది.

Published on: Dec 24, 2025, 15:48:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహిళలకు అంగన్వాడీలో ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. అనంతపురం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అంగన్వాడీ ఉద్యోగాలు
అంగన్వాడీ ఉద్యోగాలు

అంగన్వాడీ హెల్పర్ 14, అంగన్వాడీ వర్కర్ 78 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అంగన్వాడీ నియామకం కోసం నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 8 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు అప్లై చేయాలి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయములో పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తును కార్యాలయములో సమర్పించి రసీదు పొందాలి.

అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. అభ్యర్థులు వివాహితులై, స్థానికంగా నివాసం ఉన్నవారు కావాలి. అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండాలి. 01.07.2025 నాటికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండాలి.

అంగన్వాడీ కార్యకర్తకు నెలకు గౌరవ వేతనం రూ:11500, అంగన్వాడీ సహాయకులు గౌరవ వేతనం రూ:7000 చెల్లిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కులము (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదో తరగతి మార్క్స్ మెమో, ఆధార్, దివ్యాంగ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికారితో ధృవీకరణ పత్రాలను జతపరచాలి.

అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదో తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో సీడీపీఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావాలి.

ఖాళీల వివరాల కోసం సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించాలి. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును. మరిన్ని వివరాల కొరకు సంబందిత సీడీపీవో కార్యాలయం లేదా అనంతపురం జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.inలో చూసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More