...
...
Next Story

AP Rain Alert : ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలర్ట్.. తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఇలా!

AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోనూ వానలు ఉన్నాయి.

Published on: Mar 18, 2026, 17:52:57 IST
Advertisement

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ అంతర కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలర్ట్

'వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు బలంగా వీస్తాయి. ఈ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. రాబోయే మూడు రోజులు వానలు పడే అవకాశం ఉంది.' వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశాలు ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచనలు చేశారు.

ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరలు వర్షాలు పడతాయి. గురువారం అనేక ప్రాంతాల్లో వర్షాలు పెరగనున్నాయి. శుక్రవారం రోజున కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తా తీరంతోపాటుగా రాయలసీమలోనూ వర్షాలు కురవనున్నాయి.

తెలంగాణలో పరిస్థితి ఇలా

ఇదిలా ఉండగా తెలంగాణ వాతావరణ శాఖ నాలుగు రోజుల వర్ష హెచ్చరిక జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడుల నుండి విస్తరించిన ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల్లో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe