AP Telangana Rains : చల్లబడిన వాతావరణం - ఏపీ, తెలంగాణలో వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు కూడా ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులు ఉండొచ్చు.

Published on: Mar 18, 2026, 11:48:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అకాల వర్షాల నేపత్యంలో ఏపీ, తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు పడగా…. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడే సూచనలున్నాయి.

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ (AFP File )
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ (AFP File )

ఉత్తర అంతర కర్ణాటక నుంచి…. దక్షిణ అంతర కర్ణాటక మరియు అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు పడే సూచనలున్నాయి.

ఈ జిల్లాలకు హెచ్చరికలు:

తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మేడ్చల్-మల్కాజిగిరితో పాటు మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్ట్ లో పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మెదక్, నాగర్‌కర్నూల్ మరియు వనపర్తి జిల్లాలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

“హైదరాబాద్ సిటీలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో, ఈదురు గాలులతో (గంటకు 30-40 కి.మీ. వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో గంటకు 04-06 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది” అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఏపీకి వర్ష సూచన:

మరోవైపు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(మార్చి 18,2026) అల్లూరి, పోలవరం,నెల్లూరు,కడప,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…. చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More