AP Weather Update : వాతావరణం అప్డేట్.. ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు!

AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Published on: Mar 20, 2026, 06:15:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు ఆకస్మాత్తుగా వాతావరణం మారి వర్షం పడింది. జనాలకు ఎండ నుంచి ఉపశమనం దక్కింది. బుధవారం సాయంత్రం విజయవాడ, అమరావతి, పరిసర ప్రాంతాల్లో మెరుపులు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఆకస్మిక వర్షం కురిసింది. తీవ్రమైన వేడి నుండి జనాలకు ఉపశమనం కలిగించింది.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మూడు గంటల పాటు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మెరుపులతో కూడిన తీవ్రమైన ఉరుములు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షపాతం కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించింది. వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలో పేర్కొంది. ప్రకాశం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) అధికారులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జిల్లాలో అమరావతి చుట్టుపక్కల కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ, వడగళ్ల వాన పడలేదని తెలిపారు. ఐఎండీ అంచనా ప్రకారం, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మార్చి 22 వరకు గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన వేడి, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు.

మార్చి 21వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. ఉరుములు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More