ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ మేరకు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇవాళ (జూన్ 2, మంగళవారం) కూడా రాష్ట్రంలో వర్షాలతో పాటుగా కొన్నిచోట్ల ఎండ ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఎండ తీవ్రత అధికంగా ఉండే జిల్లాలు:
మంగళవారం(జూన్ 2) నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
- 42 నుంచి 44 డిగ్రీల వరకు: ఇవాళ పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42°C నుండి 44°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది.
- 40 నుంచి 42 డిగ్రీల వరకు: పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C నుండి 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
గూడూరులో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రంలో ఎండల తీవ్రత నేడు కూడా భారీగానే కొనసాగింది. సోమవారం (జూన్ 1) నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అలాగే మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఒకవైపు ఎండలు మండిపోతున్న నేపథ్యంలోనే, అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో రైతులు, గొర్రెల కాపరులు, కూలీలు చెట్ల కింద, పోల్స్ (స్తంభాల) సమీపంలో ఆశ్రయం పొందకూడదని APSDMA హెచ్చరించింది.
{{/usCountry}}ఒకవైపు ఎండలు మండిపోతున్న నేపథ్యంలోనే, అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో రైతులు, గొర్రెల కాపరులు, కూలీలు చెట్ల కింద, పోల్స్ (స్తంభాల) సమీపంలో ఆశ్రయం పొందకూడదని APSDMA హెచ్చరించింది.
{{/usCountry}}