Weather Update : ఏపీలో భిన్న వాతావరణం - 5 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, స్వల్పంగా ఎండ తగ్గే ఛాన్స్..!

AP Weather Update Today : ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, కడప సహా ఐదు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Published on: May 31, 2026, 07:42:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలు కొనసాగుతుండగా.. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఇవాళ (31-05-2026) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు
ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు

వాతావరణ నివేదిక ప్రకారం.. ఇవాళ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు ఇవే:

  • అనంతపురం
  • శ్రీసత్యసాయి
  • వైఎస్సార్ కడప
  • అన్నమయ్య
  • చిత్తూరు

ఈ ఐదు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ఆకస్మికంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పిడుగులతో కూడి ఉండే ప్రమాదం ఉన్నందున విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండే ప్రజలు, పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని సూచించింది.

వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద చెట్ల కింద, విద్యుత్ లైన్లు లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని పేర్కొంది. తక్షణమే సురక్షితమైన పక్కా భవనాల్లోకి ఆశ్రయం పొందాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.

ఒకవైపు ఎండలు.. 17 మండలాల్లో వడగాల్పులు

రాష్ట్రంలో ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ, ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు (లూ గాలులు) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఎండ తీవ్రత మరియు వడగాల్పులు ఎక్కువగా ఉండే జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగినన్ని నీళ్లు తాగుతూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More