ప్రజలపై అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విజయవాడలోని గుణదలలో రూ.35 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

'ఉద్యోగుల కృషితో పనితీరు కారణంగా విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చింది. అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా విద్యుత్ శాఖ పని చేస్తోంది. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలులో కూడా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు విద్యుత్ శాఖపై నమ్మకం పెరుగుతోంది. 95 శాతం ప్రజల సంతృప్త స్థాయిని అందుకునేలా సిబ్బంది మరింత సమర్థవంతంగా పని చేయాలి.' అని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల రెండు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెన్కో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిని సాధించిందని మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు, పవర్ లాసెస్‌ను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నామని పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. మరో వైపు అన్నదాతకు కూడా పీఎం కుసుమ్ ద్వారా పగటి పూటే 9 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ను త్వరలోనే అందిస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కుసుమ్ పథకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు కూడా ప్రారంభమవుతాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 10 చోట్ల టెండర్లు ఇప్పటికే పిలిచామని చెప్పారు.
విద్యుత్ శాఖ సిబ్బంది ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రత్యేక సేవలు అందించారని మంత్రి గొట్టిపాటి అభినందించారు. అదే విధంగా సీఎం చంద్రబాబు ఆశయ సాధన కోసం సిబ్బంది అందరూ మరింత కష్టపడి విధులు నిర్వహించి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకు రావాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
{{/usCountry}}విద్యుత్ శాఖ సిబ్బంది ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రత్యేక సేవలు అందించారని మంత్రి గొట్టిపాటి అభినందించారు. అదే విధంగా సీఎం చంద్రబాబు ఆశయ సాధన కోసం సిబ్బంది అందరూ మరింత కష్టపడి విధులు నిర్వహించి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకు రావాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
{{/usCountry}}