ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నడిబొడ్డున అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన భవనాల్లో ఒకటిగా నిలిచే అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల ఎత్తున్న 'స్పైర్' నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీని నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు వీలుగా రూ.661 కోట్లకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించేలా తాగునీటి పైప్‌లైన్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. అలాగే ప్రధాన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానించే లింక్ డ్రైనేజీ పైపుల ఏర్పాటుతో పాటు 'నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ' (NSP) నిధులు కలుపుకుని మొత్తం రూ.1,548 కోట్లతో టెండర్లు పిలవడానికి అథారిటీ పరిపాలనా అనుమతులు ఇచ్చిందని చెప్పారు.
అమరావతి ప్రాంతంలో ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. ఇందులో భాగంగా నలందా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కు కృష్ణాయపాలెంలో 5 ఎకరాల భూమిని కేటాయించారు. రాబోయే ఏడాదిన్నర వ్యవధిలో ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కానుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా నేలపాడులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) కార్యాలయ నిర్మాణం కోసం 50 సెంట్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కౌలు రూ.40 వేలకు పెంపు
రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు సొమ్ము అందిస్తోంది. జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేలు, నాన్-జరీబు భూములకు రూ.40 వేలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. అయితే 2014-19 మధ్య కాలంలో ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చిన రైతులకు గతంలో రూ.30 వేలు మాత్రమే లభించేది. ప్రస్తుతం రెండో విడత భూసమీకరణ వేళ రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం…. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వారికి కూడా కౌలును రూ.40 వేలకు పెంచుతూ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు సొమ్ము అందిస్తోంది. జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేలు, నాన్-జరీబు భూములకు రూ.40 వేలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. అయితే 2014-19 మధ్య కాలంలో ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చిన రైతులకు గతంలో రూ.30 వేలు మాత్రమే లభించేది. ప్రస్తుతం రెండో విడత భూసమీకరణ వేళ రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం…. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వారికి కూడా కౌలును రూ.40 వేలకు పెంచుతూ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}రాజధాని ప్రాంతంలోని రెవెన్యూ పరమైన సమస్యలు, చిన్నపాటి వివాదాలన్నింటినీ అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ నాటికి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను 80 శాతం వరకు విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.