...
...
Next Story

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026 : వెబ్ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా.... వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెంటనే వెబ్ ఆప్షన్లు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Aug 3, 2026, 06:03:01 IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తయిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌లో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటితో (ఆగస్టు 03, 2026) ముగియనుంది.

ఏపీ ఈఏపీసెట్ 2026 - వెబ్ ఆప్షన్లు
ఏపీ ఈఏపీసెట్ 2026 - వెబ్ ఆప్షన్లు

అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి అధికారులు నేటి వరకే గడువు ఇచ్చారు. ఇంకా ఆప్షన్లు నమోదు చేసుకోని విద్యార్థులు వెంటనే అధికారిక పోర్టల్‌ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అభ్యర్థులు https://eapcet-sche.aptonline.in/ లేదా https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా ఈ ప్రక్రియను కంప్లీట్ చేయవచ్చు.

AP EAPCET 2026 కౌన్సెలింగ్ - వివరాలు

  • వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ : ఆగస్టు 03, 2026 (ఇవాళ)
  • ఆప్షన్లలో మార్పులకు అవకాశం : ఆగస్టు 04, 2026 (ఒక్క రోజు మాత్రమే)
  • మొదటి విడత సీట్ల కేటాయింపు : ఆగస్టు 09, 2026 (సాయంత్రం విడుదల)
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - కాలేజీల్లో రిపోర్టింగ్ : ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15, 2026 వరకు
  • తరగతుల ప్రారంభం: ఆగస్టు 10, 2026 నుంచి ప్రారంభమవుతాయి.

అభ్యర్థులు ఇప్పటికే నమోదు చేసిన ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకుంటే…. వారికి ఆగస్టు 04న ఒక రోజు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అనంతరం విద్యార్థులు ఎంచుకున్న ప్రాధాన్యతలు, ర్యాంకు ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 09వ తేదీ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

సాంకేతిక లోపాలు లేదా సందేహాలు ఉన్న విద్యార్థులు సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్లను నేరుగా సంప్రదించవచ్చు. అధికారిక పోర్టల్‌లో అందించిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe