ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) రాష్ట్రవ్యాప్తంగా వాయు, శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా దీపావళి సమయంలో పర్యావరణ నిబంధనలను అమలు చేయాలని, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాలు, పోలీసులు, రవాణా, పురపాలక అధికారులను ఆదేశించింది.

విజయవాడ, విశాఖపట్నం కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, పురపాలక కమిషనర్లు, పోలీస్ కమిషనర్లకు ఇటీవల పంపిన ఒక లేఖలో నిషేధిత బాణసంచా అమ్మకం, రవాణా, వినియోగాన్ని నివారించడానికి సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని బోర్డు పిలుపునిచ్చింది. ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో గాలి నాణ్యత, శబ్ద స్థాయిలను పర్యవేక్షించాలని కూడా అధికారులను ఆదేశించింది.
దీపావళి 2025 సందర్భంగా తాము జరిపిన పర్యవేక్షణలో విశాఖపట్నంలో పీఎం10 స్థాయిలు క్యూబిక్ మీటరుకు 238 మైక్రోగ్రాముల వరకు, పీఎం2.5 స్థాయిలు క్యూబిక్ మీటరుకు 138 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు ఏపీపీసీబీ తెలిపింది. కోర్టు ఆదేశాలకు లోబడి, గాలి నాణ్యత మధ్యస్థంగా లేదా అంతకంటే మెరుగ్గా ఉన్న నగరాలు, పట్టణాలలో, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NEERI) ఆమోదించిన గ్రీన్ క్రాకర్లకు మాత్రమే అనుమతి ఇస్తారు. బేరియం లవణాలతో సహా నిషేధిత రసాయనాలు కలిగిన సంప్రదాయ టపాసులు నిషేధించారు. అనుమతించిన ప్యాక్‌లపై వాటి రిజిస్ట్రేషన్, లైసెన్స్, టెస్ట్ సర్టిఫికేట్‌లకు అనుసంధానించిన ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లు తప్పనిసరిగా ఉండాలని బోర్డు తెలిపింది.
నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి పర్యావరణ నియంత్రణ మండలి ప్రాంతాల వారీగా గరిష్ఠ శబ్ద పరిమితులను(Noise Limits in dB(A)) నిర్దేశించింది. పగలు, రాత్రి సమయాలకు సంబంధించి వేర్వేరు నిబంధనలు అమలులో ఉన్నాయి. పరిశ్రమల నుంచి వర్కింగ్ జోన్ల వరకు పర్యావరణ శాఖ నిర్దేశించిన శబ్ద కాలుష్య ప్రమాణాలు చూసుకుంటే..
నిర్ణీత శబ్ద పరిమితులు(dB(A)లో పారిశ్రామిక ప్రాంతాలలో పగటిపూట 75 డెసిబెల్స్, రాత్రిపూట 70, వాణిజ్య ప్రాంతాలలో 65, రాత్రిపూట 55, నివాస ప్రాంతాలలో పగలు 55, రాత్రిపూట 45, నిశ్శబ్ద ప్రాంతాల్లో పగటిపూట 50, రాత్రిపూట 40గా నిర్దేశించారు. పగటి సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రాత్రి సమయం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లెక్కిస్తారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కోర్టులకు 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాలు నిశ్శబ్ద ప్రాంతాలుగా నిర్దేశించారు, ఇక్కడ హారన్ మోగించడం నిషేధం.
{{/usCountry}}నిర్ణీత శబ్ద పరిమితులు(dB(A)లో పారిశ్రామిక ప్రాంతాలలో పగటిపూట 75 డెసిబెల్స్, రాత్రిపూట 70, వాణిజ్య ప్రాంతాలలో 65, రాత్రిపూట 55, నివాస ప్రాంతాలలో పగలు 55, రాత్రిపూట 45, నిశ్శబ్ద ప్రాంతాల్లో పగటిపూట 50, రాత్రిపూట 40గా నిర్దేశించారు. పగటి సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రాత్రి సమయం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లెక్కిస్తారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కోర్టులకు 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాలు నిశ్శబ్ద ప్రాంతాలుగా నిర్దేశించారు, ఇక్కడ హారన్ మోగించడం నిషేధం.
{{/usCountry}}ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, విద్యా సంస్థలు, నిశ్శబ్ద ప్రాంతాల్లో 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చడం నిషేధించారు. రాత్రి 10 గంటల నుండి అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్‌లను ఉపయోగించకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.10,000 పర్యావరణ పరిహార రుసుము విధిస్తారు. అంతేకాకుండా వినియోగించిన మైకులు, సౌండ్ సిస్టమ్ పరికరాలను అధికారులు తక్షణమే సీజ్ చేస్తారు. డీజిల్ జనరేటర్ల వల్ల కలిగే వాయు, శబ్ద కాలుష్య ఉల్లంఘనలపై కూడా కఠినమైన నిబంధనలు తెచ్చారు. జనరేటర్ సామర్థ్యం, ఉల్లంఘన తీవ్రతను బట్టి రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు పర్యావరణ పరిహారం విధిస్తారు. కాలుష్య నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరం అని ఏపీపీసీబీ ఛైర్మన్ పి. కృష్ణయ్య అన్నారు, పర్యావరణ అనుకూల వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.