...
...
Next Story

AP AYUSH Recruitment : ఏపీ ఆయూష్ విభాగంలో 58 ఉద్యోగాలు - మంచి జీతం, రాత పరీక్ష లేకుండానే...!

AP AYUSH Recruitment 2026 : ఏపీ ఆయూష్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 58 ఖాళీలను భర్తీ చేస్తారు.ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలున్నాయి. ఏప్రిల్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Apr 20, 2026, 11:23:36 IST
Advertisement

AP AYUSH Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (APMSRB) నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఆయుర్వేద, హోమియోపతి విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 58 ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నియామకాలు ఒక ఏడాది కాలానికి లేదా రెగ్యులర్ పోస్టుల భర్తీ జరిగే వరకు కొనసాగుతాయి.

ఏపీ ఆయూష్ విభాగంలో ఉద్యోగాలు
ఏపీ ఆయూష్ విభాగంలో ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రొఫెసర్ (యూజీ) పోస్టులు 30 ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 28 ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ. 80,910 చొప్పున, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ. 65,360 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.

అర్హతలు…

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 8 ఏళ్ల బోధనా అనుభవం , అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 3 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. వీటితో పాటు అభ్యర్థులు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా గుర్తింపు పొంది ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2025 నాటికి 60 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం

  • అభ్యర్థులను ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు.
  • మొత్తం 100 పాయింట్లకు గాను ఎంపిక ప్రక్రియ సాగుతుంది:అకడమిక్ మెరిట్, క్వాలిఫైయింగ్ పరీక్షలో సాధించిన మార్కులకు గరిష్టంగా 75 పాయింట్లు కేటాయిస్తారు.
  • పీజీ పూర్తి చేసిన తర్వాత ప్రతి ఏడాదికి 1 పాయింట్ చొప్పున గరిష్టంగా 10 పాయింట్లు ఇస్తారు.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసిన వారికి గరిష్టంగా 15 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది. ఇందులో కోవిడ్ విధులు నిర్వర్తించిన వారికి ప్రతి ఆరు నెలలకు 5 మార్కుల చొప్పున ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తారు.
  • గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాలకు 2 మార్కులు, పట్టణ ప్రాంతాలకు 1 మార్కు చొప్పున ఆరు నెలల సర్వీసును బట్టి కేటాయిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ….

ఓసీ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగులు రూ. 1000 ఫీజు చెల్లించాలి.ఈ నియామకాల్లో లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో చదివిన వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తమ స్టడీ సర్టిఫికేట్లు, పీజీ మార్క్స్ మెమోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు మరియు ఇతర అవసరమైన పత్రాలను ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks