AIIMS Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 50 వేలకుపైగా జీతం, ఈ తేదీలో ఇంటర్వ్యూ
AIIMS Bibinagar Recruitment 2026 : హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ లో 21 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వాళ్లు… ఏప్రిల్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీ కోసం సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు:
బీబీనగర్ ఎయిమ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం…. మొత్తం 11 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు చూస్తే కింది విధంగా ఉన్నాయి….
- అనస్థీషియా: 02
- కార్డియో థొరాసిక్ సర్జరీ (CTVS): 01
- డెర్మటాలజీ (DVL): 01
- జనరల్ మెడిసిన్: 03
- జనరల్ సర్జరీ: 03
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 02
- నెఫ్రాలజీ: 01
- ఆర్థోపెడిక్స్: 03
- పల్మనరీ మెడిసిన్: 01
- రేడియేషన్ ఆంకాలజీ: 01
- ట్రామా & ఎమర్జెన్సీ: 03
అర్హతలు - ముఖ్యమైన వివరాలు…
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ తో పాటు ఎండీ (MD), ఎంఎస్ (MS), డీఎన్‌బీ (DNB) లేదా దానికి సమానమైన పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ఏప్రిల్ 29, 2026 నాటికి 45 ఏళ్లు మించకూడదు. అయితే ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 ప్రాథమిక వేతనంతో పాటు ఎన్‌పీఏ , ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ఒకవేళ నాన్-మెడికల్ (M.Sc, Ph.D) అభ్యర్థులైతే లెవల్-10 ప్రకారం రూ. 56,100 వేతనం…. ఇతర అలవెన్సులకు అర్హులవుతారు.
ఆసక్తి గల అభ్యర్థులు బీబీనగర్ ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లోని గూగుల్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులు రూ. 1770 (GST తో కలిపి) ఫీజు చెల్లించాలి. కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇంటర్వ్యూ తేదీ…
అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలు మే 5, 2026న ఉదయం 11 గంటల నుంచి బీబీనగర్ ఎయిమ్స్ అకాడమిక్ బ్లాక్‌లోని మినీ బోర్డు రూమ్‌లో జరుగుతాయి. అభ్యర్థులు మే 5న ఉదయం 8:30 గంటలకే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, గూగుల్ ఫామ్ దరఖాస్తు కాపీని వెంట తీసుకురావాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

