AP Model School Admissions 2026 : ఏపీ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు - దరఖాస్తులు ప్రారంభం, ప్రాసెస్ ఇలా

AP Model Schools Admissions 2026 : ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 12వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Feb 27, 2026, 18:15:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు… మార్చి 31వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.

ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు
ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు

ఏప్రిల్ లో ఎంట్రెన్స్ ఎగ్జామ్….

ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయో.. ఆ పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియాల్లో నిర్వహిస్తారు.

సంబంధిత జిల్లాలల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి. ఓసీ, బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్…

  • అభ్యర్థులు ముందుగా https://apms.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • వివరాల నమోదు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలి. సీటు ప్రతిభ ఆధారంగా అంటే ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా వస్తుంది. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సాంఘిక అండ్ సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More