...
...
Next Story

TTD Admissions 2026 : టీటీడీ సంగీత, నృత్య కళాశాలల్లో అడ్మిషన్లు - జూన్ 2 నుంచి దరఖాస్తులు

TTD Music College Admissions 2026 : తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: May 31, 2026, 12:20:31 IST
Advertisement

TTD Music College Admissions 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సర్వం సిద్ధమైంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, అలాగే ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది.

టీటీడీ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు
టీటీడీ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు

2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ రెగ్యులర్ కోర్సుల్లో చేరడానికి అర్హత, ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ కళాశాలల్లో జూన్ 2వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలను జారీ చేయనున్నట్లు టీటీడీ యాజమాన్యం వెల్లడించింది. భర్తీ చేసిన దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.

కోర్సుల వివరాలు…

భారతీయ సాంప్రదాయ కళలను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అభ్యర్థుల సౌకర్యార్థం ఫుల్ టైమ్ (రెగ్యులర్), పార్ట్ టైమ్ (సాయంత్రం కళాశాల) కోర్సులను అందిస్తున్నారు.

  • ముఖ్య విభాగాలు : గాత్రం, వీణ, వేణువు (ఫ్లూట్), వయోలిన్, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ, మృదంగం మరియు ఘటం వంటి అనేక సాంప్రదాయ విభాగాలలో శిక్షణ ఇస్తారు.
  • డిగ్రీ - డిప్లొమా కోర్సులు : కళాశాలలో బి.మ్యూజిక్, బి.డ్యాన్స్ (B.Dance) వంటి గ్రాడ్యుయేషన్ కోర్సులతో పాటు విశారద, ప్రవీణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • ఎస్వీ నాదస్వర పాఠశాల : ఇక్కడ సర్టిఫికెట్, డిప్లొమా రెగ్యులర్ కోర్సులతో పాటు ఉద్యోగులు, ఇతర విద్యార్థుల కోసం సాయంత్రం వేళల్లో పార్ట్ టైమ్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు.

దరఖాస్తు విధానం…

ప్రవేశాలు, కోర్సుల వివరాలు, ఫీజుల నిబంధనలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం కేటాయించిన కింది ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

  • ల్యాండ్ లైన్: 0877-2264597
  • మొబైల్ నంబర్లు: 9848374408, 9440793205, 9642796991

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe