TTD Sculpture College Admissions 2026 : భారతీయ సనాతన ధర్మాన్ని, అపురూపమైన ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా…. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ సంస్కృతిని, వారసత్వ కళలను వృత్తిగా మార్చుకోవాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం.
మే 4 నుంచి దరఖాస్తులు…

4 సంవత్సరాల డిప్లొమా కోర్సు, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 4వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టీటీడీ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలి.
ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది.
1960లో స్థాపించబడిన ఈ శిల్పశిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏకైకంగా నిలిచి, భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణం, వాస్తు, శిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోంది.
కోర్సుల వివరాలు:
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు ఏఐసిటిఈ అనుమతితో నిర్వహించే ఈ కోర్సులో 6 విభాగాలు ఉన్నాయి:
- ఆలయ నిర్మాణం
- శిలా శిల్పం
- సుధా శిల్పం
- లోహ శిల్పం
- కొయ్య శిల్పం
- సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం
ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పున, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.
{{/usCountry}}ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పున, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.
{{/usCountry}}వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారి కళకు మంచి డిమాండ్ ఉంది.రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 04 నుండి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టీటీడీ ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నారు.
ఇతర వివరాలకు శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ,తిరుమల తిరుపతి దేవస్థానములు, అలిపిరి రోడ్, తిరుపతి – 517507ను సంప్రదించవచ్చు. లేదా www.tirumala.org వెబ్ సైట్ లేదా 0877-2264637 నెంబర్ కు కాల్ చేయవచ్చు.