...
...
Next Story

AP Forest Recruitment : అటవీ శాఖ థానేదార్ అభ్యర్థులకు అప్డేట్ - ఈనెల 30న నడక, వైద్య పరీక్షలు

APPSC Forest Recruitment : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో థానేదార్ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నవంబర్ 30న నడక, వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాజమహేంద్రవరంలో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు.

Published on: Nov 18, 2026, 11:04:38 IST
Advertisement

APPSC Forest Recruitment : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో థానేదార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబర్ 30వ తేదీన నడక పరీక్ష (వాకింగ్ టెస్ట్), వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వివరాలను కమిషన్ వెల్లడించింది.

పరీక్షా కేంద్రాలు ఇవే

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

అభ్యర్థులకు రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. రాజమహేంద్రవరంలోని రాష్ట్ర అటవీ అకాడమీతో పాటు మహా పుష్కర వనంలో నడక పరీక్షను నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థులకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (GGH) వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు.

నడక పరీక్ష, వైద్య పరీక్షల్లో విజయవంతంగా అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. వీరు తప్పనిసరిగా ధ్రువపత్రాల పరిశీలనకు (సర్టిఫికెట్ వెరిఫికేషన్) హాజరు కావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

సెప్టెంబర్ 9, 2025 నాటి నోటిఫికేషన్ నంబర్ 13/2025 ద్వారా చేపట్టిన థానేదార్ నియామక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష ఫలితాలను ప్రకటించారు. తదుపరి దశకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. వీరంతా కూడా నడక టెస్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks