APPSC AMVI Recruitment 2026 : ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 50 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల నేరుగా భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 26 వరకు అవకాశం…

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 2026 నవంబరు 6 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు 2026 నవంబరు 26 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే సమర్పించిన OTPR ఐడీ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయాలి. కొత్తగా దరఖాస్తు చేసేవారు ముందుగా వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ / హైదరాబాద్‌లోని టెక్నికల్ డిప్లొమా ఎగ్జామినేషన్ బోర్డ్ జారీ చేసిన ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
దీనితో పాటు, అభ్యర్థులకు మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం 3 సంవత్సరాల పాటు మోటార్ వాహనాలు నడిపిన అనుభవంతో పాటు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఎండార్స్‌మెంట్ తప్పనిసరి. ఒకవేళ 3 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటారు.
మహిళా అభ్యర్థుల దరఖాస్తుల సమయంలో లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాల వ్యవధిలోపు వారు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఎండార్స్‌మెంట్ సాధించాల్సి ఉంటుంది. లేనిచో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సర్వీస్ నుండి తొలగిస్తారు.
{{/usCountry}}మహిళా అభ్యర్థుల దరఖాస్తుల సమయంలో లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాల వ్యవధిలోపు వారు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఎండార్స్‌మెంట్ సాధించాల్సి ఉంటుంది. లేనిచో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సర్వీస్ నుండి తొలగిస్తారు.
{{/usCountry}}అభ్యర్థుల వయస్సు 01.07.2026 నాటికి 21 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి మినహాయింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సిసి ఇన్‌స్ట్రక్టర్లకు సైతం నియమావళి ప్రకారం సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుండి రూ.1,37,220 వరకు పే-స్కేల్ లభిస్తుంది.
ఎంపిక విధానం…
అభ్యర్థుల ఎంపికను రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష - CBRT) ప్రాతిపదికన చేపడతారు. ఈ పోస్టులకు ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి:
- పేపర్-1: జనరల్ స్టడీస్ - మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) - 150 మార్కులు
- పేపర్-2: ఆటోమొబైల్ ఇంజినీరింగ్ (డిప్లొమా స్టాండర్డ్) - 300 మార్కులు
మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT), శారీరక ప్రమాణాలు నిర్వహిస్తారు.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.250, పరీక్ష రుసుము కింద రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు వైట్ కార్డ్ కలిగిన అభ్యర్థులకు రూ.120 పరీక్ష రుసుము నుండి మినహాయింపు ఇచ్చారు.
అప్లికేషన్ ప్రాసెస్….
- ముందుగా https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Post of Assistant Motor Vehicle Inspector లింక్ పై క్లిక్ చేయాలి.
- ఓటీపీఆర్ ఐడీ, పాస్ వర్డ్ తో పాటు క్యాప్చాను నమోదు చేసి లాగిన్ కావాలి.
- మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. పూర్తి వివరాల తర్వాత సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.