APPSC Recruitment : దేవాదాయ శాఖలో 104 ఈవో ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

APPSC Endowments EO Grade 3 Recruitment : ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో 104 గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 19, 2026, 06:57:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

APPSC EO Grade 3 Recruitment : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ (APPSC) మరో శుభవార్త అందించింది. రాష్ట్ర దేవదాయ సబార్డినేట్ సర్వీస్‌లోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 104 జిల్లా కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 5, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేవదాయ శాఖలో 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
దేవదాయ శాఖలో 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

ముఖ్యమైన వివరాలు :

  • మొత్తం ఖాళీలు - 104
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే…. దేవాదాయ శాఖ చట్టం (Act No.30/1987) ప్రకారం కేవలం హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు.
  • వయోపరిమితి - 01-07-2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
  • జీతం - నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910
  • దరఖాస్తులకు చివరి తేదీ - నవంబర్ 5, 2026

ఎంపిక విధానం:

రాత పరీక్ష (CBRT విధానం) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అనంతరం కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ (CPT)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మరియు వైట్ రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ( https://psc.ap.gov.in ) సందర్శించి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకోవాలి. అనంతరం యూజర్ ఐడీతో లాగిన్ అయి దరఖాస్తు సమర్పించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More