APPSC Recruitment : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్ - దరఖాస్తులు ప్రారంభం! ఇంటర్ అర్హతతోనే….
APPSC Forest Beat Officer Recruitment : ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSC Forest Beat Officer Recruitment : రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు వేతన స్కేలు లభిస్తుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాబోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. విద్యా అర్హతలతో పాటుగా అటవీ శాఖ నిబంధనల ప్రకారం నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండటం తప్పనిసరి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో నవంబర్ 05, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఎంపిక విధానం…..
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను సరళతరం చేశారు. ఎలాంటి ప్రాథమిక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించకుండా, కేవలం ఒకే ఒక దశలో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBRT) ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారికి వాకింగ్ టెస్ట్ (నడక పరీక్ష) మరియు మెడికల్ ఎగ్జామినేషన్ (వైద్య పరీక్షలు) నిర్వహిస్తారు.
రాత పరీక్షను మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి….
- క్వాలిఫైయింగ్ టెస్ట్ (డిస్క్రిప్టివ్ ): ఇంగ్లీష్, తెలుగు లేదా ఉర్దూ భాషలో అడవులు, పర్యావరణం అంశాలపై వ్యాసరూప ప్రశ్న ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయించారు, సమయం 45 నిమిషాలు.
- పేపర్-1 : జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంశాలపై 100 మార్కులకు గాను 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. సమయం 100 నిమిషాలు.
- పేపర్-2 : పదవ తరగతి స్థాయిలో జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ అంశాల నుంచి 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు అడుగుతారు. సమయం 100 నిమిషాలు.
రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత విధిస్తారు. దీనితో పాటు అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కూడా నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

