AP Local Elections 2026 : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - ఈ నెల 21 నుంచి నామినేషన్లు

AP MPTC ZPTC Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి, నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు.

Published on: Oct 19, 2026, 12:35:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP MPTC ZPTC Elections 2026 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా సమగ్ర షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్
ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు :

  • నామినేషన్ల స్వీకరణ : ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
  • నామినేషన్ల పరిశీలన : దాఖలైన నామినేషన్లను ఈ నెల 24వ తేదీన అధికారులు కూలంకషంగా పరిశీలిస్తారు.
  • నామినేషన్ల ఉపసంహరణ : పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు.
  • పోలింగ్ తేదీ : నవంబర్ 3వ తేదీన ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
  • అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ చేపడతారు.
  • నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పరిషత్ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా స్థానిక పోలీస్ యంత్రాంగంతో కలసి ఎన్నికల అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌లు, 659 జెడ్పీటీసీ, 659 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2,81,34, 518 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

  • అమరావతిలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ వివరించారు.
  • అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు తలెత్తగా… ప్రాదేశిక ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోనున్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More