APPSC Group 1 Notification 2026 : గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా కొలువుల సాధనకై ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. మొత్తం 166 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ( https://portal-psc.ap.gov.in/ లేదా https://psc.ap.gov.in ) ద్వారా ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకుని, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర వివరాలను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచారు.
గ్రూప్-1 పరిధిలోని అత్యధిక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే సాంకేతిక నైపుణ్యం అవసరమైన డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టుకు మాత్రం ఇంజినీరింగ్ విభాగంలో (ఈసీఈ, టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి) సంబంధిత డిగ్రీ డిగ్రీ తప్పనిసరి చేశారు.
ఖాళీల వివరాలు…
- డిప్యూటీ కలెక్టర్లు : 12 పోస్టులు
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36
- డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03
- జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు
- రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్‌టీఓ): 03
- జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు
- డిప్యూటీ రిజిస్ట్రార్: 16 పోస్టులు
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02
- జిల్లా ఉపాధి కల్పనాధికారి: 03
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 15
- డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీఓ): 35 పోస్టులు
ఈసారి ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 కేడర్ కేటాయింపుల్లో పరిపాలనాపరంగా కొన్ని ప్రధాన మార్పులు అమలు చేశారు. ఇప్పటివరకు గ్రూప్-1 కింద భర్తీ చేస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టును ఈ సారి నోటిఫికేషన్ పరిధి నుంచి మినహాయించారు. అలాగే గతంలో సాధారణంగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) స్థానాన్ని ఈసారి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టుతో భర్తీ చేయనున్నారు. వీటికి అదనంగా, సుదీర్ఘ కాలం తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి (డీఈఓ) వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను కొత్తగా గ్రూప్-1 సర్వీసెస్ జాబితాలోకి చేర్చారు.
{{/usCountry}}ఈసారి ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 కేడర్ కేటాయింపుల్లో పరిపాలనాపరంగా కొన్ని ప్రధాన మార్పులు అమలు చేశారు. ఇప్పటివరకు గ్రూప్-1 కింద భర్తీ చేస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టును ఈ సారి నోటిఫికేషన్ పరిధి నుంచి మినహాయించారు. అలాగే గతంలో సాధారణంగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) స్థానాన్ని ఈసారి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టుతో భర్తీ చేయనున్నారు. వీటికి అదనంగా, సుదీర్ఘ కాలం తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి (డీఈఓ) వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను కొత్తగా గ్రూప్-1 సర్వీసెస్ జాబితాలోకి చేర్చారు.
{{/usCountry}}