హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ) వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ విభాగాలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య 73. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 29వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతన స్కేలు రూ.37,640 నుంచి రూ.1,15,500 మధ్య ఉంటుంది.
ఏపీ సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-21, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-23, ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-29 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 73.
రాతపరీక్ష ద్వారానే ఎంపిక పూర్తి చేస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఒకవేళ పరీక్షను బహుళ సెషన్లలో నిర్వహిస్తే నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత ఉంటుంది.
పరీక్ష మొత్తం రెండు పేపర్లుగా ఆబ్జెక్టివ్ విధానంలో డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్ - I (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు, పేపర్ - II (ఎడ్యుకేషన్ - సబ్జెక్ట్): 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు ఉంటాయి.
అభ్యర్థులు రాత పరీక్షతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ ఆచరణాత్మక పరీక్ష 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.
{{/usCountry}}అభ్యర్థులు రాత పరీక్షతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ ఆచరణాత్మక పరీక్ష 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.
{{/usCountry}}అభ్యర్థులు ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే ముందు, కమిషన్ జారీ చేసిన సమగ్ర నోటిఫికేషన్, ఇతర సూచనలను జాగ్రత్తగా చదవాలి. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే సమర్పించాలి. నిర్దేశించిన ఆన్‌లైన్ విధానం కాకుండా ఇతర పద్ధతుల్లో పంపిన దరఖాస్తులు ఏ పరిస్థితుల్లోనూ పరిగణించరు.
చివరి నిమిషంలో తలెత్తే రద్దీని నివారించడానికి, గడువు తేదీకి ముందే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం, ఈ పరీక్షకు సంబంధించిన సమగ్ర విధానం, సిలబస్ ఈ నోటిఫికేషన్‌కు జతచేశారు.
సిలబస్
అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయికి సంబంధించిన ముఖ్యమైన సమకాలీన సంఘటనలు, అంశాలు చూసుకోవాలి. సాధారణ విజ్ఞానశాస్త్రం, దైనందిన జీవితంలో దాని అనువర్తనాలు, విజ్ఞానశాస్త్రం, సాంకేతికత మరియు సమాచార సాంకేతికత రంగాలలో సమకాలీన పరిణామాలు ఫాలో కావాలి.
భారతీయ చరిత్ర – సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ కోణాలలో ఈ అంశంపై సమగ్ర అవగాహనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, భారత జాతీయ అంశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. భారతదేశ భౌగోళిక శాస్త్రం.. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన: రాజ్యాంగపరమైన అంశాలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలు.
భారత ఆర్థిక వ్యవస్థ-ప్రణాళిక, సుస్థిర అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ విపత్తు నిర్వహణ: vulnerability ప్రొఫైల్, నివారణ-ఉపశమన వ్యూహాలు, విపత్తు అంచనాలో రిమోట్ సెన్సింగ్-GIS వినియోగం. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక సామర్థ్యం-తార్కిక వివరణ. డేటా అనాలసీస్: Tabulation of data Visual representation of data Basic dataanalysisను అభ్యర్థులు చదువుకోవాలి.