...
...
Next Story

APPSC : డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ అభ్యర్థులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల

APPSC : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

Published on: May 14, 2026, 14:04:32 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. గత ఏడాది 2025 జూలై 15 నుండి జూలై 23 వరకు నిర్వహించిన ఆన్‌లైన్ రాత పరీక్షల (CBT) ఫలితాల ఆధారంగా, తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

ధృవీకరణ ఎప్పుడు? ఎక్కడ?

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

రాత పరీక్షలో ప్రతిభ కనబరిచి, తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులకు 2026, మే 20 నుండి మే 29 వరకు సర్టిఫికెట్ల ధృవీకరణ (Certificate Verification) నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి. APPSC కార్యాలయం, మహాత్మా గాంధీ రోడ్డు, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా, విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.

అభ్యర్థులు చేయాల్సింది

ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ నుండి కొన్ని పత్రాలను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అర్హత సాధించిన అభ్యర్థులు మెమోరాండంలో పేర్కొన్న చెక్‌లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, ఇతర సంబంధిత పత్రాలను కమిషన్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. విద్యార్హత, కుల, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఉండాలి.

అభ్యర్థులకు విడివిడిగా కాల్ లెటర్లు పంపిస్తారు. అలాగే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) తేదీలను కమిషన్ ప్రత్యేకంగా ప్రకటిస్తుంది. ఈ మేరకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ షెడ్యూల్ తర్వాత విడుదల చేస్తారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్లే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు కనీసం రెండు సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోండి. కాల్ లెటర్‌లో సూచించిన సమయం కంటే గంట ముందుగానే వేదికకు చేరుకోవడం ఉత్తమం. ఫోటోలు, ఐడెంటిటీ కార్డులను (ఆధార్/పాన్) మర్చిపోకుండా తీసుకెళ్లండి. మరిన్ని వివరాల కోసం, ఫలితాల జాబితా కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe