ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల అధ్యాపకుల కోసం మార్చి 2 నుండి 'డిసిప్లేన్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఆప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)' అనే అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(FDP)ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(APSCHE) నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లోని ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సెల్‌లో జరుగుతుంది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(RUSA) ఆర్థిక సహాయంతో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ సహకారంతో ఎఫ్‌డీపీని నిర్వహిస్తున్నారు.
APSCHE విడుదల చేసిన ప్రకటనలో NEP-2020, విక్షిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా, విభిన్న విద్యా విభాగాలలోని అధ్యాపకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇస్తారు. స్పష్టత, ఆచరణాత్మక అవగాహనను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఇంటెన్సివ్ శిక్షణా కార్యక్రమం ఉపాధ్యాయులను డిసిప్లేన్-స్పెసిఫిక్, నో-కోడ్, లో-కోడ్ ఏఐ అప్లికేషన్లతో సన్నద్ధం చేయడానికి రూపొందించారు. బోధన, పరిశోధన, పాఠ్యాంశాల పంపిణీలో ఏఐ సాధనాలు, డేటా-ఆధారిత విధానాలను ఏకీకృతం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాణిజ్యం, నిర్వహణ, లైఫ్ సైన్సెస్, భౌతిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవీయ శాస్త్రాలు, కంప్యూటర్ సైన్స్‌తోపాటుగా మరికొన్నింటిని కవర్ చేస్తుంది.
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా థియరీ సెషన్‌లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ కార్యకలాపాలు, కేస్ స్టడీస్, మరికొన్ని టూల్స్ ఉన్నాయి. ఏఐ ఎకో సిస్టమ్, ప్లాట్‌ఫారమ్‌లు, ఎడ్జ్ ఏఐ, డేటా రకాలు, రిపోజిటరీలు, ఎథిక్స్ మరియు బాధ్యతాయుతమైన AI వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది. వీటితోపాటుగా చాలా విషయాల్లో శిక్షణ ఉంటుంది.
ఈ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల అధ్యాపకులకు అత్యాధునిక ఏఐ సాధనాలు, రియల్-వరల్డ్ అప్లికేషన్స్, సైన్స్, టెక్నాలజీ, బోధనా శాస్త్రాలను అనుసంధానించే ఇంటర్ డిసిప్లినరీలాంటి అంశాలను కవర్ చేస్తారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు.
{{/usCountry}}ఈ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల అధ్యాపకులకు అత్యాధునిక ఏఐ సాధనాలు, రియల్-వరల్డ్ అప్లికేషన్స్, సైన్స్, టెక్నాలజీ, బోధనా శాస్త్రాలను అనుసంధానించే ఇంటర్ డిసిప్లినరీలాంటి అంశాలను కవర్ చేస్తారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు.
{{/usCountry}}