...
...
Next Story

EV Charging Stations : APSPDCL కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

EV Charging Stations : ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(APSPDCL) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది.

Published on: Mar 10, 2026 02:30 PM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(APSPDCL) తన అధికార పరిధిలోని 162 ప్రదేశాలలో ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 13 kW లైట్ ఈవీ ఏసీ/డీసీ ఛార్జర్‌లతో కూడిన ఛార్జింగ్ స్టేషన్‌లను పీఎం-ఈ ​​డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోథేటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ మొబిలిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ PM-KUSUM 2.0 పథకం కింద ఫీడర్-స్థాయి సోలరైజేషన్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. 2026–27 నుండి 2029–30 వరకు ఏటా 550 ఎండబ్ల్యూ సౌర సామర్థ్యాన్ని జోడించాలని, మొత్తం 2,200 ఎండబ్ల్యూలను జోడించాలని యోచిస్తోంది. 500 ఎండబ్ల్యూ / 1000 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(BESS) మొదటి దశలో అమలులో ఉంది.

ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, భవిష్యత్తు వ్యూహాలను సమీక్షించడానికి ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్‌తో వర్చువల్‌గా సీఎండీ శివశంకర్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్యతోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని భారతదేశంలోని మొట్టమొదటి నెట్-జీరో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను కూడా సీఎండీ హైలైట్ చేశారు. గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున స్వీకరించడం, స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు.

ఈ కార్యక్రమం కింద 7,489 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే 4.36 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, 48,000 గృహాలను కవర్ చేసే 39.75 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలు, 50 మెగావాట్లు / 100 మెగావాట్ల బీఈఎస్ఎస్ ప్రాజెక్ట్ ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe