విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మెనూలో ఒక ఛేంజ్.. చికెన్‌కు బదులు చేపలు!
Telangana Midday Meal Scheme : విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా చేపలు అందించాలని చూస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే చెబుతోంది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆలోచనలు చేస్తోంది. వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్ష సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజల ముంగిటకు చేరేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.
తహశీల్దార్ కేడర్ కంటే తక్కువ కాని అధికారిని ఎస్సీ/ఎస్టీ/బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లకు ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని, వారానికి ఒకసారి వారు హాస్టళ్లను సందర్శించి ఆహార నాణ్యతను తనిఖీ చేయాలన్నారు మంత్రి శ్రీహారి. హాస్టళ్లలో ఏదైనా తప్పు జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇటీవలే ఈ విషయంపై రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన కోసం నియమించిన అధికారిని బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అధికారి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కూడా వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినాలని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా.. అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. అయితే మధ్యాహ్న భోజన పథకంలో కొత్త బియ్యం వాడటంతో అన్నం ముద్దగా అయ్యేది. దీంతో స్టీమ్ రైస్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి స్టీమ్ రైస్ పంపిణీ చేయాలని నిశ్చయించుకుంది. నిజానికి అన్నం ముద్దగా అవుతుంటే.. విద్యార్థులు తినేందుకు ఇష్టపడటం లేదు.
ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్టీమ్ రైస్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు సర్క్యూలర్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతోంది. అంతేకాకుండా సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ చదువుకునే 10 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.
ఇక దీనితోపాటుగా ప్రభుత్వం చికెన్ స్థానంలో చేపలు పెడితే విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందనుంది. ఒకవేళ ఒకవారం చికెన్, మరొకవారం చేపలు.. ఇలా కూడా అమలుచేసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












