కార్తీక మాసం.. మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో పంచారామాలు, శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC Karthika Masam special buses : కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు మిడిల్ క్లాస్ బడ్జెట్‌ ధరలో ప్యాకేజీలను అందిస్తోంది.

Updated on: Oct 25, 2026, 15:08:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాస మహోత్సవాలు, శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజల కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఏలూరు జిల్లా నుంచి శబరిమలతో పాటు ప్రసిద్ధ పంచారామ క్షేత్ర దర్శనాల కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఎస్.కె. షబ్నం వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం (X)
ప్రతీకాత్మక చిత్రం (X)

భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సునాయాసంగా తమ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునేలా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రోజుల వ్యవధిని బట్టి మూడు రకాల ప్యాకేజీలను ఆర్టీసీ నిర్ణయించింది.

4 రోజుల శబరిమల ప్యాకేజీ: రూ. 5,200

6 రోజుల శబరిమల ప్యాకేజీ: రూ. 6,000

10 రోజుల శబరిమల ప్యాకేజీ: రూ. 9,000

ఇక కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన పంచారామ క్షేత్రాల దర్శనం కోసం వెళ్లే భక్తులకు బస్సు రకాన్ని బట్టి ఛార్జీలను ఖరారు చేశారు.

అల్ట్రా డీలక్స్ బస్సు: రూ. 1,100

సూపర్ లగ్జరీ బస్సు: రూ. 1,200

పంచారామ క్షేత్రాల ప్రత్యేక బస్సులు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే సోమవారం సాయంత్రానికి తిరిగి ఏలూరు చేరుకునేలా టైమ్ షెడ్యూల్ రూపొందించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఏలూరు జిల్లాలోని ఏలూరు డిపోతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

పవిత్రమైన కార్తీక మాసంలోనూ, శబరిమల యాత్రలోనూ ప్రయాణికులు సొంత వాహనాల కన్నా ఆర్టీసీ సురక్షిత సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు కోరారు. సీట్ల బుకింగ్ కోసం సమీపంలోని ఆర్టీసీ డిపోలను గానీ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More