సాధారణ ఛార్జీలతోనే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. లిస్ట్

APSRTC special buses : ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

Published on: Sep 14, 2026, 21:15:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సర్వీసులతో పాటు అదనంగా వివిధ నగరాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం పడకుండా సాధారణ ఛార్జీలకే ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు (X)
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు (X)

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ నుంచి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని వివిధ పట్టణాలకు అనేక బస్సులను కేటాయించారు.

హైదరాబాద్ నుంచి ఏపీకి

విజయవాడ: 1 డాల్ఫిన్ క్రూయిజ్, 11 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్

మచిలీపట్నం: 1 నైట్ రైడర్, 2 ఇంద్ర, 1 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్

ఏలూరు: 2 ఇంద్ర, 2 సూపర్‌ లగ్జరీ, 3 అల్ట్రా డీలక్స్

అమలాపురం: 1 ఇంద్ర, 2 సూపర్‌ లగ్జరీ

జంగారెడ్డిగూడెం: 1 ఇంద్ర, 1 సూపర్‌ లగ్జరీ

తిరువూరు: 1 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్

గుడివాడ: 1 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్

పొన్నూరు: 1 ఇంద్ర, 1 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్

తెనాలి: 1 ఇంద్ర, 1 సూపర్‌ లగ్జరీ

విశాఖపట్నం: 1 సూపర్‌ లగ్జరీ

కాకినాడ: 1 సూపర్‌ లగ్జరీ

ఎలేశ్వరం: 1 అల్ట్రా డీలక్స్

రావులపాలెం: 1 సూపర్‌ లగ్జరీ

భీమవరం: 1 అల్ట్రా డీలక్స్

నరసాపురం: 1 సూపర్‌ లగ్జరీ

తణుకు: 1 సూపర్‌ లగ్జరీ

నూజివీడు: 2 అల్ట్రా డీలక్స్

పెనుగంచిప్రోలు: 1 సూపర్‌ లగ్జరీ

గన్నవరం: 1 సూపర్‌ లగ్జరీ

అవనిగడ్డ: 3 సూపర్‌ లగ్జరీ

ఉయ్యూరు: 1 ఎక్స్‌ప్రెస్

గుంటూరు: 2 సూపర్‌ లగ్జరీ

చిలకలూరిపేట: 1 సూపర్‌ లగ్జరీ

నరసరావుపేట: 1 అల్ట్రా డీలక్స్

మాచర్ల: 1 సూపర్‌ లగ్జరీ

నెల్లూరు: 1 సూపర్‌ లగ్జరీ

ప్రొద్దుటూరు: 2 సూపర్‌ లగ్జరీ

ఆళ్లగడ్డ: 1 ఎక్స్‌ప్రెస్

నంద్యాల: 1 ఎక్స్‌ప్రెస్

ఆత్మకూరు (కె): 1 సూపర్‌ లగ్జరీ

బెంగళూరు నుంచి బస్సుల వివరాలు

బెంగళూరు నుంచి రాయలసీమ, ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కేటాయించింది.

తిరుపతి: 3 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్, 7 సప్తగిరి ఎక్స్‌ప్రెస్, 2 ఎక్స్‌ప్రెస్

ప్రొద్దుటూరు: 1 సూపర్‌ లగ్జరీ, 4 అల్ట్రా డీలక్స్

కర్నూలు: 3 సూపర్‌ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్

కడప: 1 సూపర్‌ లగ్జరీ, 3 అల్ట్రా డీలక్స్

తాడిపత్రి: 1 అల్ట్రా డీలక్స్

ఉరవకొండ: 1 ఎక్స్‌ప్రెస్

బద్వేలు: 1 సూపర్‌ లగ్జరీ

కదిరి: 2 ఎక్స్‌ప్రెస్

నెల్లూరు: 2 సూపర్‌ లగ్జరీ

గుంటూరు: 1 సూపర్‌ లగ్జరీ

చెన్నై నుంచి సర్వీసులు

విజయవాడ: 2 సూపర్‌ లగ్జరీ బస్సులు

గుంటూరు: 1 సూపర్‌ లగ్జరీ బస్సు

ఈ ప్రత్యేక సర్వీసులన్నింటికీ ముందస్తు సీట్ల రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా APSRTC అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు సూచించారు. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి గురికాకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. సాధారణ ఛార్జీలకే ప్రయాణించవచ్చని అధికారులు అంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More