ఏపీ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు.. ఐటీఐ అభ్యర్థులకు జపనీస్ భాష శిక్షణ

APSSDC : ఆంధ్రప్రదేశ్ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు లభించేలా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు ఐటీఐ అభ్యర్థులకు జపనీస్ భాష శిక్షణ కొసం కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.

Published on: May 6, 2026, 10:28:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) తన నైపుణ్య అంతర్జాతీయ కార్యక్రమం కింద.. ఏపీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జపాన్‌కు చెందిన ఫోర్త్ వ్యాలీ కాన్సియెర్జ్ కార్పొరేషన్ (FVCC)తో లెటర్ ఆఫ్ ఇంటెంట్(LoI)పై సంతకం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ

ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పత్రంపై APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.మనోహర్, FVCCM ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అకి టకేడా సంతకం చేశారు. ఈ సహకారం ముఖ్య ఉద్దేశం ఆటోమొబైల్ రంగంపై ప్రాథమికంగా దృష్టి సారించి, నిర్దిష్ట నైపుణ్యం గల కార్మికులు(SSW), ఇంజనీర్/స్పెషలిస్ట్ ఇన్ హ్యుమానిటీస్/అంతర్జాతీయ సేవలు (EHI) వంటి వీసా కేటగిరీల కింద జపాన్‌లో నియామకాల కోసం మార్గాలను సృష్టించడం.

ఈ భాగస్వామ్యం కింద APSSDC తన సంస్థాగత నెట్‌వర్క్ ద్వారా అభ్యర్థులను సమీకరించి, పరిశీలించి, సిద్ధం చేస్తుందని APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ అన్నారు. అదే సమయంలో FVCC జపాన్‌లోని తన యజమానుల నెట్‌వర్క్ ద్వారా నియామకాలను సులభతరం చేస్తుందని, నిబంధనలకు అనుగుణంగా నియామక సమన్వయం, డాక్యుమెంటేషన్, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలకు మద్దతు ఇస్తుందని తెలిపారు.

రెండు సంస్థలు సంయుక్తంగా అభ్యర్థుల నమోదు, పరిశీలన చేపడతాయని, నోడల్ అధికారులతో ఒక వ్యవస్థీకృత అమలు చట్రాన్ని ఏర్పాటు చేస్తాయని మనోహర్ తెలిపారు. అంతేకాకుండా ఐటీఐ అభ్యర్థులకు జపనీస్ భాష శిక్షణ అందించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. తద్వారా వారు ప్రపంచ కార్మిక శక్తి అవకాశాలలో పాల్గొనేందుకు వీలవుతుందని ఆయన తెలియజేశారు.

ప్రపంచస్థాయిలో ఉపాధికి ఆంధ్రప్రదేశ్‌ను ఒక బలమైన ప్రతిభా కేంద్రంగా నిలపడానికి సిద్ధంగా ఉన్నామని మనోహర్ అన్నారు. జపాన్‌లో ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఉమ్మడి నిబద్ధతను ఈ సహకారం ప్రతిబింబిస్తుందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More