...
...
Next Story

ఐటీఐ, డిప్లొమా చేసినవారికి మంచి జీతంతో రష్యాలో ఉద్యోగాలు

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే యువతకు గుడ్‌న్యూస్. ఐటీఐ, డిప్లొమా చేసినవారు రష్యాలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది.

Published on: Jan 25, 2026, 14:41:12 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ (OMCAP)తో కలిసి రష్యాకు చెందిన సైబర్ స్టీల్‌ ద్వారా ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేసినవారికి విదేశీ ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. ఒక ప్రకటనలో ఏపీఎస్ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓఎంసీఏపీ జనరల్ మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ.. రష్యాలోని పెర్వౌరల్స్క్‌లో ఉన్న ఇండోర్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీలో మెటల్, పైప్ స్ట్రెయిటెనర్ ‌వాటికి అర్హులైన అభ్యర్థులను నియమిస్తామని తెలిపారు.

రష్యాలో ఉద్యోగాలు (Unsplash)
రష్యాలో ఉద్యోగాలు (Unsplash)

ఉద్యోగం పూర్తి సమయం ఒక సంవత్సరం ఒప్పందంతో ఉంటుంది. ఆదాయంతో పాటు అంతర్జాతీయ పని అనుభవాన్ని మీరు పొందవచ్చు. ఐటీఐ అర్హతలు (షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్) లేదా మెటలర్జీ లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉన్నవారు అర్హులు. ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం, సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రష్యన్ రూబిళ్లు(సుమారు రూ.72వేలు) జీతం, 10,000 రూబిళ్లు ఆహార భత్యం లభిస్తుంది. అదనపు ప్రయోజనాలలో ఉచిత వసతి, కంపెనీ చెల్లించే రష్యాకు విమాన ఛార్జీలు, ఒప్పందం పూర్తయిన తర్వాత రిటర్న్ టికెట్, ఉచిత వైద్య, జీవిత బీమా ఉన్నాయి.

పని షెడ్యూల్‌లో రొటేషనల్ ప్రాతిపదికన 12 గంటల షిఫ్టులు ఉంటాయి. సాధారణ విశ్రాంతి రోజులు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు: https://naipunyam.ap.gov.in. అభ్యర్థులు ఏపీనైపుణ్యం వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 9988853335, 8712655686 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe