...
...
Next Story

సౌదీ అరేబియాలో ఉద్యోగాలకు ఫిబ్రవరి 18న ఇంటర్వ్యూ.. ఏపీఎస్ఎస్‌డీసీ ద్వారా రిక్రూట్‌మెంట్

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) గుడ్‌న్యూస్ చెప్పింది. సౌదీ అరేబియాలో ఉద్యోగాలను అందిస్తోంది. ఇందుకు విజయవాడలో ఫిబ్రవరి 18న ఇంటర్వ్యూ జరుగుతుంది.

Published on: Feb 17, 2026, 20:34:20 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ (OMCAP), 2COMS కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సౌదీ అరేబియాలో ఎల్ అండ్ టీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనుంది. సౌదీ అరేబియాలో ఉద్యోగ అవకాశాల కోసం బుధవారం (ఫిబ్రవరి 18) విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

అధికారుల ప్రకారం, ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ (ఓఎంసీఏపీ), 2COMS కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సౌదీ అరేబియాలోని రియాద్‌లో కేబుల్ స్ప్లైసర్, కేబుల్ జాయింటర్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ టెక్నీషియన్, మెకానికల్ టెక్నీషియన్, ప్లంబర్, స్కాఫోల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు ఈ డ్రైవ్ ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఐటీఐ (ప్రాధాన్యత ఇస్తారు) లేదా డిప్లొమా అర్హత, 3 నుంచి 5 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి. 22 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

హిందీ, ఇంగ్లీషులో ప్రావీణ్యం తప్పనిసరి. జీతం ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.28,800 నుండి రూ.72,000 వరకు ఉంటుంది. ఓవర్‌టైమ్ వర్తించే విధంగా జీతం అందిస్తారు.

ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్, విద్యా, అనుభవ ధృవీకరణ పత్రాలు, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, అసలు పాస్‌పోర్ట్‌ను తీసుకురావాలి. ఆసక్తిగల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు APSSDC కమాండ్ కంట్రోల్ నంబర్‌లను సంప్రదించవచ్చు. ఆ నెంబర్లు : 9988853335, 8712655686, 8790118349, 8790117279.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe