అగ్రికల్చరల్ కాలేజీలో జాబ్ నోటిఫికేషన్.. ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్వ్యూ!
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మడకశిర అగ్రికల్చరల్ కాలేజీలో జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంది.
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మడకశిరలో రిక్రూట్‍మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హతలు గల అభ్యర్థులు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకశిరలో ఒప్పంద ప్రాతిపదికన పార్ట్ టైమ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

పార్ట్‌టైమ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. 11 నెలలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేయాలి. పోస్టును అనుసరించి.. సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. నెలకు రూ.25,000 వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ 11.02.2026 ఉదయం 10.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకశిరలో ఉంటుంది.
ఆసక్తిగల అభ్యర్థులు 11.02.2026న ఉదయం 10.30 గంటలకు మడకశిరలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లోని అసోసియేట్ డీన్ ఛాంబర్‌లో జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి TA/DA చెల్లించరు. పైన పేర్కొన్న పోస్ట్ పూర్తిగా తాత్కాలికమైనది, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుందని గుర్తుంచుకోవాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 11వ తేదీన అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు వాటి జిరాక్స్ కాపీ, ఇతర సంబంధిత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. బయో డేటాతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఉద్యోగం చేస్తుంటే), ధృవీకరించిన ఫోటో కాపీలతో దరఖాస్తులను 11.02.2026న ఉదయం 9.30 గంటలకు పైన చెప్పిన కార్యాలయంలో సమర్పించాలి.
ఎంపిక కమిటీ నిర్ణయం ఫైనల్ అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తి ఒక నెల సమయం ఇవ్వడం ద్వారా స్వయంగా కాంట్రాక్టు సేవను వదిలివేయవచ్చు. ముందుగా చెప్పకుండా వెళ్లిపోవాలి అనుకుంటే.. నిష్క్రమించే ముందు ఒక నెల జీతం చెల్లించాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


