...
...
Next Story

ఈ జిల్లాల విద్యార్థులకు గమనిక.. జూన్ 8న గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశాల కోసం పరీక్ష రాసిన, రాయకపోయిన విద్యార్థులకు అలర్ట్. జూన్ 8వ తేదీన కౌన్సెలింగ్ ఉండనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది.

Published on: Jun 2, 2026, 19:21:25 IST
Advertisement

వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం జూన్ 8, 2026 (సోమవారం) నాడు ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

అంబేద్కర్ గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్
అంబేద్కర్ గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్

ప్రవేశ పరీక్ష రాసినవారు, రాయలేకపోయినవారు సీటు లభించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ కడప జిల్లా సమన్వయ అధికారి ఎ.ఉదయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం వైఎస్ఆర్ కడప జిల్లాలోని చిన్నచౌక్ వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల వేదికగా జరుగుతుంది. ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే బాలబాలికలకు వేర్వేరు సమయాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

5వ తరగతి ప్రవేశాల కోసం

అర్హులైన బాలబాలికలు ఇద్దరూ హాజరుకావచ్చు. 08.06.2026 ఉదయం 10:00 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, చిన్నచౌక్ స్కూల్, వైఎస్ఆర్ కడపకు హాజరుకావాలి..

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం

అర్హులైన బాలబాలికలు హాజరుకావచ్చు 08.06.2026 మధ్యాహ్నం 03:00 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, చిన్నచౌక్ స్కూల్, వైఎస్ఆర్ కడప వద్ద స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.

ఈ స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు అనేది పూర్తిగా ఆయా పాఠశాలలు/కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు, ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే జరుగుతుంది. గురుకులాల్లో నాణ్యమైన ఉచిత విద్య, వసతి పొందాలనుకునే అర్హత కలిగిన విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం.

వెంట తెచ్చుకోవలసిన పత్రాలు

వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఆసక్తి గల విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే ఒక గంట ముందే చిన్నచౌక్ లోని గురుకుల కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe