విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, సింహచలంలో స్వయంభూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో భక్తుల దుస్తులపై ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింహాచలం అప్పన్న దర్శనార్థం వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు.

ఈ నూతన నిబంధనలను ఈ నెల చివరి నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ పవిత్రతను పరిరక్షించడం, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, స్వామివారి పట్ల భక్తిప్రపత్తులను పెంపొందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని దేవస్థానం తెలిపింది.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు పంచె, కుర్తా-పైజామాలాంటివి వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు, షార్ట్స్ వేసుకోరాదు. మహిళలు చీర, లంగా ఓణీ, చుడీదార్ లాంటివి వేసుకోవాలి. జీన్స్, టాప్స్, లెగ్గింగ్స్, స్లీవ్‌లెస్ / పొట్టి దుస్తులు ధరించి దర్శనానికి రావొద్దు.
సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామి క్షేత్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఏడాదంతా స్వామివారు చందన పూతతో నరసింహ రూపంలో దర్శనమిస్తారు. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.
వరాహము, నరుడు, సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో – వరాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(నిజరూపదర్శనం) ఆలయ అధికారులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఉత్సవం ముందురోజు అర్థరాత్రి 12.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
{{/usCountry}}వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(నిజరూపదర్శనం) ఆలయ అధికారులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఉత్సవం ముందురోజు అర్థరాత్రి 12.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
{{/usCountry}}ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం తరలివస్తుంటారు. డ్రెస్ కోడ్ నిబంధనలతో పాటు ఆలయ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం పలు చర్యలు చేపడుతోంది.
డ్రెస్ కోడ్ అమలుపై అవగాహన కల్పించేందుకు కొండపైన, మెట్ల మార్గం వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ సమయాల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాల క్యూ లైన్లను పటిష్టం చేస్తున్నారు.