ఆంధ్రా యూనివర్సిటీ(AU) పాత విద్యార్థులకు తమ కోర్సులను పూర్తి చేసుకునేందుకు ఇప్పుడు సువర్ణావకాశం వచ్చింది. పలు కారణాల వల్ల పరీక్షలు పాస్ కాలేకపోయిన బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షలు - 2026 (AU Special Drive Examinations 2026) నిర్వహిస్తోంది.

పరీక్షల ఇన్‌చార్జ్ కంట్రోలర్ జె. రత్నం జారీ చేసిన ప్రకటన ప్రకారం, 2010-11 మధ్య ప్రవేశం పొందిన, అలాగే 2025 నాటికి తమ కోర్సుల్లో సబ్జెక్టులు ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్, వృత్తిపరమైన కోర్సుల విద్యార్థుల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) జూన్ 15 నుండి 'ప్రత్యేక డ్రైవ్ పరీక్షలు-2026'ను నిర్వహించనుంది.
ఈ స్పెషల్ డ్రైవ్ పరీక్షలన్నీ విశాఖపట్నంలోని ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ బిల్డింగ్ వేదికగా జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పూర్తి టైమ్‌టేబుల్‌ను త్వరలోనే యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో విడిగా విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేక పరీక్షలు రాయడానికి ఏయూ నిర్దిష్ట బ్యాచ్‌ల విద్యార్థులకు అవకాశం కల్పించింది.
2010-11 అకడమిక్ ఇయర్ నుండి అడ్మిషన్ పొందిన వారు ఈ పరీక్షలకు అర్హులు. 2025 వ సంవత్సరం వరకు తమ కోర్సు కాలపరిమితిని పూర్తి చేసుకుని, ఇంకా బ్యాక్‌లాగ్స్ మిగిలిపోయిన విద్యార్థులందరూ ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, సైన్స్, లా మరియు ఎడ్యుకేషన్ వంటి అనేక రకాల కోర్సులను చేర్చారు. B.Arch., B.Tech., integrated B.Tech.-M.Tech., M.Tech., M.Planning, M.Pharmacy, M.Sc., M.A., M.Com., M.H.R.M., M.B.A., B.Pharmacy, Pharma-D, MCA, BCA, LL.B., LL.M., B.Ed., M.Ed., Special B.Ed., D.P.Ed., B.P.Ed., M.P.Ed., M.Sc. Computer Science and M.Sc. Information Systemsతోపాటుగా మరికొన్ని కోర్సుల పరీక్షలు రాయవచ్చు.
ఈ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక పోర్టల్ సందర్శించి పరీక్ష ఫీజులు చూసుకోవాలి. పాత విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు కాబట్టి, సాధారణ పరీక్షల కంటే ఫీజు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి యూనివర్సిటీకి వెళ్లి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
{{/usCountry}}ఈ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక పోర్టల్ సందర్శించి పరీక్ష ఫీజులు చూసుకోవాలి. పాత విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు కాబట్టి, సాధారణ పరీక్షల కంటే ఫీజు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి యూనివర్సిటీకి వెళ్లి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
{{/usCountry}}టైమ్‌టేబుల్ విడుదలైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారానే తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. చాలా ఏళ్ల తర్వాత వర్సిటీ కల్పిస్తున్న ఈ తరహా స్పెషల్ డ్రైవ్ పరీక్షలు పాత విద్యార్థులకు తమ డిగ్రీలను పూర్తి చేసుకోవడానికి ఒక చివరి అవకాశంగా భావించవచ్చు.
అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ఏయూ అధికారిక వెబ్‌సైట్ www.andhrauniversity.edu.in ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.