రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు UDID కార్డులు, త్రీవీలర్ మోటార్ బైకుల పంపిణీ, దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లు, వయోవృద్ధులకు వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాల పంపిణీ, ట్రాన్స్ జెండర్స్‌కి గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అడ్మిషన్లు 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. దివ్యాంగ పాఠశాలల్లో మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు మెనూ అమలులో రాజీపడొద్దని మంత్రి స్పష్టం చేశారు.
'విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మార్చిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి. దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలి. వయో వృద్ధులకు సహాయ పరికరాలు ఎక్కువ మందికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలి.' అని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం : మంత్రి అచ్చెన్నాయుడు
బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పొగాకు రైతులు, చిరువ్యాపారులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పొగాకు హెచ్ఎస్ కోడ్ 2401 కిందకు వచ్చే, రీటైల్ విక్రయాల కోసం ప్యాక్ చేయని అన్‌బ్రాండెడ్ ముడి పొగాకుపై ఇకపై ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ వర్తించదని తెలిపారు.
గతంలో అస్పష్టమైన నిబంధనల వల్ల రైతులు, వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ గెజిట్‌తో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే బ్రాండెడ్‌గా ప్యాక్ చేసిన పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పన్నుల విషయంలో స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని, రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మార్పులతో ముడి పొగాకు సరఫరా వ్యవస్థకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి భంగం కలగదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్యాకింగ్, రీటైల్ విక్రయాలపై పన్ను వర్తింపుపై ఉన్న సందేహాలు ప్రస్తుత గెజిట్‌తో పూర్తిగా తొలగిపోయాయని మంత్రి తెలిపారు.
{{/usCountry}}గతంలో అస్పష్టమైన నిబంధనల వల్ల రైతులు, వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ గెజిట్‌తో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే బ్రాండెడ్‌గా ప్యాక్ చేసిన పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పన్నుల విషయంలో స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని, రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మార్పులతో ముడి పొగాకు సరఫరా వ్యవస్థకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి భంగం కలగదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్యాకింగ్, రీటైల్ విక్రయాలపై పన్ను వర్తింపుపై ఉన్న సందేహాలు ప్రస్తుత గెజిట్‌తో పూర్తిగా తొలగిపోయాయని మంత్రి తెలిపారు.
{{/usCountry}}