గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం అమలు జరుగుతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. గోదావరి తీరంలో ఏటా విధించే ‘మన్‌సూన్ హాలిడే’ (వర్షాకాల విరామం) నేటి నుంచి (జూన్ 1) అమలులోకి వచ్చింది. నదుల పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, వర్షాకాలంలో వరదల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ వార్షిక నిషేధాన్ని విధిస్తారు.

మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిషేధాజ్ఞలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగనున్నాయి. జూన్ 1 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 15 వరకు అమల్లో ఉంటుంది. గోదావరి తీరంలోని సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు (యంత్రాల ద్వారా ఇసుక తీసే ప్రాంతాలు), పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, సేకరణను పూర్తిగా బ్యాన్ చేశారు.
వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. అలాగే ఈ సమయంలో నదీ జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం.
నిషేధ కాలంలో భవన నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇసుక కొరత రాకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందుస్తు చర్యలు చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 43 ఇసుక రీచ్‌లలో కలిపి సుమారు 14.57 లక్షల మెట్రిక్ టన్నుల గోదావరి ఇసుకను ముందే సేకరించి స్టాక్ పాయింట్లలో భద్రపరిచారు.
ప్రధాన రీచ్‌లు ఇవే
కొవ్వూరు, పేరవలి, నిడదవోలు, సీతానగరం, రాజమహేంద్రవరం, తాళ్లపూడి తదితర ప్రాంతాల్లోని స్టాక్ యార్డుల ద్వారా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయనున్నారు.
నదిలో తవ్వకాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. కొందరు అక్రమార్కులు రాత్రి సమయాల్లో ఇసుకను తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించింది. మైన్స్ అండ్ జియాలజీ (గనులు), రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్ మరియు రవాణా శాఖలు సంయుక్తంగా గోదావరి తీరప్రాంతాల్లో గస్తీ కాయనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు, భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
{{/usCountry}}నదిలో తవ్వకాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. కొందరు అక్రమార్కులు రాత్రి సమయాల్లో ఇసుకను తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించింది. మైన్స్ అండ్ జియాలజీ (గనులు), రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్ మరియు రవాణా శాఖలు సంయుక్తంగా గోదావరి తీరప్రాంతాల్లో గస్తీ కాయనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు, భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
{{/usCountry}}