...
...
Next Story

ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!

శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు ఉన్న బోటు వచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Published on: Nov 30, 2025, 21:56:00 IST
Advertisement

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు వచ్చింది. అయితే డి.మత్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా వెళ్తున్న బోటును గమనించారు. సముద్రంలో వేట లేకున్నా ఈ సమయంలో వెళ్లడం ఏంటని అనుకున్నారు. ఇసుక దిబ్బలపై ఉన్న స్థానిక మత్స్యకారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు.

బంగ్లాదేశ్ మత్స్యకారులు
బంగ్లాదేశ్ మత్స్యకారులు

కొట్టుకొచ్చిన బోటులో 13 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే వారు మాట్లాడేది మెుదట్లో అర్థంకాక కాసేపు సమస్యలు తలెత్తింది. ఎట్టకేలకు వారు బంగ్లాదేశ్ మత్స్యకారులుగా మెరైన్ పోలీసులు గుర్తించారు. సముద్రంలో వెటకు వచ్చి.. వీరి బోటు తప్పిపోయింది. దీంతో చాలా రోజులుగా సముద్రంలోనే గడుపుతూ వస్తున్నారు. అయితే ఇంధనం, భోజన సామగ్రి అయిపోయింది. దాదాపు 15 రోజులకు సరిపడా తెచ్చుకున్న ఆహార సామగ్రి అయిపోయేసరికి చేసేదేమీ లేక అలానే ఉండిపోయారు.

సముద్రంలోనే కొన్ని రోజులు తిండి లేక ఉన్నారు. వారి బోటు పశ్చిమ బెంగాల్, ఓడిశా మీదుగా శ్రీకాకుళం జిల్లా తీరానికి చేరింది. బిక్కు బిక్కుమంటూ అలానే గడిపారు. అయితే ఓవైపు దిత్వా తుపాను ప్రభావంతో సముద్రంలో వేటపై అధికారులు ఆంక్షలు విధించారు. కానీ స్థానికులకు మాత్రం ఏదో బోటు సముద్రంలో వెళ్తున్నట్టుగా కనిపించింది. అనుమానాస్పదంగా అనిపించేసరికి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బోటు మన ప్రాంతానికి చెందినది కాదని స్థానికులు తెలిపారు. అందులో ఉన్నవారిని కూడా అనుమానించారు. మెరైన్ పోలీసులు వచ్చి.. మరో మూడు బోట్ల సాయంతో సిబ్బందిని పంపించారు. బంగ్లాదేశ్ మత్స్యకారులను ఒడ్డుకు తెచ్చారు. వారిని చూసి మాట్లాడిన తర్వాత బంగ్లాదేశ్ వ్యక్తులుగా గుర్తించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe