BC Protection Act : ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రక్షణ చట్టం.. కులం, వృత్తి పేరుతో తిడితే కఠిన చర్యలు!
BC Protection Act : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ రక్షణ చట్టం తీసుకురానుంది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది.
బీసీ రక్షణ చట్టంతో వెనబడిన వర్గాలు గౌరవ ప్రదంగా సామాజిక జీవనం కొనసాగించేలా రక్షణ కల్పిస్తున్నామని, కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం రూపొందిస్తున్నామని మంత్రులు ఎస్.సవిత, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలో జిల్లా స్థాయిలోనూ బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు.

బీసీ ముసాయిదా రక్షణ చట్టం జాతీయ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని, అక్కడ అనుమతి రాగానే అసెంబ్లీలో ఆమోదానికి ప్రవేశపెడతామని మంత్రి సవిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా బీసీ రక్షణ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో బీసీ ముసాయిదా రక్షణ చట్టంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కీలక సమావేశం జరిగింది. సమావేశ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు.
మంత్రి సవిత సవిత మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. బీసీలను వేధించినా, జాతి, కుల వృత్తుల పేరుతో దూషించినా బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హులున్నారు. బీసీ రక్షణ చట్టం కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందజేసిన సలహాలు సూచనలను ఇప్పటికే రూపొందించిన బీసీ ముసాయిదా రక్షణ చట్టం బిల్లులో పొందుపరుస్తామన్నారు.
త్వరలో జిల్లాల్లోనూ బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు మంత్రి సవిత. తుది నివేదికను త్వరలో జాతీయ బీసీ కమిషన్ కు అందజేస్తామన్నారు. బీసీ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, అసెంబ్లీలో ఆమోదానికి బీసీ రక్షణ చట్టాన్ని సభలో ప్రవేశపెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ సైతం బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీలు సమాజానికి బ్యాక్ బోన్లు అని వ్యక్తులు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అని మంత్రి సవిత తెలిపారు.
బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మా పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారన్నారు. వారు కుల వివక్షకు గురికాకుండా ఉండాలని భావించి బీసీ రక్షణ చట్టానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. దేశంలో ఎన్నో చట్టాలున్నా బీసీల రక్షణకు చట్టం లేదన్నారు. గత ప్రభుత్వ మధ్య పాలనలో బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో బీసీలు తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారన్నారు. రెండేళ్ల నుంచి బీసీ రక్షణ చట్టం గురించి చర్చిస్తూ వస్తున్నామన్నారు. శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లు ఆమోదించే ముందే కేంద్ర జాతీయ బీసీ కమిషన్ సలహాలు కూడా తీసుకుంటామన్నారు.
అంతకుముందు మంత్రి సవిత నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. బీసీ రక్షణ చట్టం పటిష్టంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. బీసీలను వృత్తులపరంగా, కులాల పరంగా దూషించుకుండా ఉండేలా చట్టం అమలు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


