అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు పశుసంవర్థక శాఖ నిర్ధారించింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కొన్ని ప్రాంతాలలో కోళ్లు మరణించినట్లుగా తెలుస్తోంది. దీనితో పశుసంవర్ధక శాఖ భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పరీక్షల కోసం నమూనాలను పంపింది.

అన్నమయ్య జిల్లాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులు నిర్ధారించారు. శనివారం దాదాపు 40, ఆదివారం దాదాపు 50 నాటుకోళ్లు చనిపోయాయని అధికారులు తెలిపారు. పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లెలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టుగా గుర్తించారు.
'అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన బర్డ్ ఫ్లూ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను నియమించింది.' అని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు.
NIHSAD ప్రయోగశాల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా ఫిబ్రవరి 8న ఈ వ్యాధి కన్ఫామ్ అయింది. ఆ తర్వాత విధానాలకు అనుగుణంగా తక్షణ నియంత్రణ చర్యలు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌టీలను మోహరించామని, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల సమన్వయంతో తొలగింపు కార్యకలాపాలు జరిగాయని మంత్రి తెలిపారు.
ప్రజల భయపడొద్దని మంత్రి కోరారు. వైరస్ పక్షులను మాత్రమే ప్రభావితం చేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు. సరిగ్గా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు తినడం పూర్తిగా సురక్షితమని తెలిపారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో ఆకస్మాత్తుగా కోళ్లు మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, నమూనాలను పరీక్ష కోసం NIHSADకి పంపారు. సదుం, కార్వేటినగరం మండలాల నుండి అదనపు నమూనాలను కూడా భోపాల్ ప్రయోగశాలకు పంపారు. అధికారులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో ఆకస్మాత్తుగా కోళ్లు మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, నమూనాలను పరీక్ష కోసం NIHSADకి పంపారు. సదుం, కార్వేటినగరం మండలాల నుండి అదనపు నమూనాలను కూడా భోపాల్ ప్రయోగశాలకు పంపారు. అధికారులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
{{/usCountry}}పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సిబ్బందికి మరియు రైతులకు వ్యాధి నియంత్రణ ప్రోటోకాల్‌లను సూచించారని, ఏదైనా అసాధారణ పక్షుల మరణాలను వెంటనే నివేదించాలని కోళ్ల పెంపకందారులను కోరారు.
మదనపల్లె మండలం కొత్తవారిపల్లెలో కూడా కోళ్లు చనిపోయాయి. ఈ నమూనాలను కూడా టెస్టింగ్ కోసం పంపారు. మదనపల్లెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. అనుమానాలు ఉంటే 7013914401, 9398262752 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తినడం సురక్షితమని, సగం వండిన మంసాన్ని తినవద్దని అధికారులు సూచిస్తున్నారు.